ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 7:59 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అఖిల భారత యాదవ మహాసభ ముత్తారం మండల అధ్యక్షుడిగా చెల్కల జితేందర్ యాదవ్.

అఖిల భారత యాదవ మహాసభ ముత్తారం మండల అధ్యక్షుడిగా చెల్కల జితేందర్ యాదవ్.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // ముత్తారం రిపోర్టర్.

ముత్తారం మండల కేంద్రంలో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా చెల్కల జితేందర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూనేటి కృష్ణ యాదవ్, యువజన అధ్యక్షుడిగా ఏడుమేకల కిరణ్ యాదవ్, యువజన ప్రధాన కార్యదర్శిగా మర్రి కుమారస్వామి యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంధవేణి రాజేందర్ యాదవ్ నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. నూతనంగా ఎన్నికైన వారికి శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల ఐక్యతే సంఘం బలోపేతానికి ప్రధాన బలమని అన్నారు. సమాజ హక్కుల సాధన కోసం నాయకులు, యువత సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయి నుంచే యాదవ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, యువతను సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు.

నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ముత్తారం మండలంలో అఖిల భారత యాదవ మహాసభను మరింత బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం నాయకులు పెగడ రమేష్ యాదవ్, నరసింహ యాదవ్, పర్ష బక్కయ్య యాదవ్, ఉడుత పర్వతాలు యాదవ్, కాసు తిరుపతి యాదవ్, మ్యారేడుగొండ రాజయ్య యాదవ్, బక్కతట్ల కుమార్ యాదవ్, కొడారి మల్లేష్ యాదవ్తో పాటు మండలంలోని యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.